News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దంతెలబోర ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీలో అసలైన ఎస్టీలకు అన్యాయం

పాల్వంచ మండలం, దంతెలబోర ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీలో అసలైన ఎస్టీ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం దంతెలబోర ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీలో మొత్తం 609 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా పూర్తిగా ఎస్సీ కుటుంబాలకు చెందినవారు.

ఈ గ్రామంలో కేవలం ఒకే ఒక్క ఎస్టీ కుటుంబం ఉంది. గతంలో కూడా సర్పంచ్‌గా ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని ఎన్నుకున్నారు.

ఇటీవల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా, ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన బీసీ అభ్యర్థులు, తమను ఎస్టీలుగా చెప్పుకుంటూ నామినేషన్ వేశారని ఆరోపించారు.

గ్రామస్తులు ఎవరికీ తెలియకుండా, లెక్చరర్ మరియు డాక్టర్ ద్వారా గెజిటెడ్ సంతకాలు చేయించుకొని, నకిలీ ధ్రువపత్రాలతో నామినేషన్ దాఖలు చేశారని రమేష్ పేర్కొన్నారు.

అమాయకులైన గుత్తికోయల (గిరిజనుల)ను కొందరు నాయకులు స్వలాభం కోసం బలిచేస్తూ, ఆర్.ఓ. (రిటర్నింగ్ ఆఫీసర్) సహకారంతో నామినేషన్‌ను ఆమోదింపజేశారని తెలిపారు.

క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే

అధికారం ఎమ్మార్వోకు ఉన్నప్పటికీ, ఆయన ధ్రువపత్రం లేకుండా కేవలం గెజిటెడ్ సంతకాలతో ఆర్.ఓ. ఎలా ఫైనల్ చేస్తారని ప్రశ్నించారు. ఈ నకిలీ సంతకాల వెనుక ఉన్నవారు మరియు ఆర్.ఓ.పై చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎం.ఆర్.ఓ., ఆర్.డి.ఓ., కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

ఈ అభ్యర్థులు రేపు  మధ్యాహ్నం 2 గంటల్లోపు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే, గ్రామం మొత్తం సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.