చర్చ,గోదావరిఖని: గృహ శోభ పోటీ క్వాటర్ల పరిశీలన..
గృహ శోభ పోటీ క్వాటర్ల పరిశీలన..
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్జీ ఏరియాలో గృహ శోభ పోటీలకు దరఖాస్తు చేసుకున్న వారి క్వార్టర్స్ ను బుధవారం గృహ శోభ కమిటీ బృందం సభ్యులు సందర్శించారు. ఇంటి ఆవరణ లోని పరిసరాలు, అందమైన పూల మొక్కలు, పచ్చని లోగిలిని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికయిన గృహాలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ ప్రధాన వేడుకలో బహుమతుల ప్రదానోత్సవం చేయనున్నట్లు కమిటి సభ్యులు డిజియం ఎన్విరాన్మెంట్ వేణు, డిజియం ఫారెస్ట్ కర్ణ, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు పేర్కొన్నారు.