చర్చ,గోదావరిఖని: ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాలు….
ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాలు….
ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాలు….
చర్చ,గోదావరిఖని: వీర్లపల్లి లోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలలో బాగంగా వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ వో స్వర్ణలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులకు ,ఒంటరి తనంతో బాదలు పడేవారు,కుటుంబ సభ్యులకు బారంగా ఉన్నామనే ఆలోచనలో ఉన్నవారికి ఈ కార్యక్రమాలకు ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు.మనసులో బాధలను తొలగించి వారిలో ఉత్సాహం ,దైర్యాన్ని నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వలన వయో వృద్ధుల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వయో వృద్ధులకు ఏవైనా సమస్యలు ఉంటే 14567 అనే నంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు..
