చర్చ,సుల్తానాబాద్: రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు.
విద్యార్థులను అభినందించిన పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్ .
రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి 14 సంవత్సరాల బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలలో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఈ వర్షిత,టి అభిజ్ఞ శ్రీ, ఏం సంప్రీత్ లు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు హైదరాబాదు లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.వీరి ఎంపిక పట్ల పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేశారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలతో విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ, సతీష్, మమత విద్యార్థులు పాల్గొన్నారు.