చర్చ, జగిత్యాల : రిపబ్లిక్ పేరేడ్ కు ఎంపికైన జగిత్యాల క్రీడాకారిణి మంగ
జనవరి 26 న ఢిల్లీ లో జరిగే రిపబ్లిక్ వేడుకలలో
నిర్వహించే ఎన్ సి. సి క్యాడేట్స్ పేరేడ్ లో జగిత్యాల కు చెందిన పూర్వ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి, ప్రస్తుత పి. ఈ. టి చేని మంగ ఎంపికయ్యారు. సీనియర్ భాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన మంగ ఎన్. సి. సి లోను ప్రతిభ ను కనబరిచి మౌంట్ కార్మల్ స్కూల్లో పి. ఈ. టి.గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఢిల్లీలో జనవరి 26 న జరిగే రిపబ్లిక్ పేరేడ్ లో పాల్గొనే వారికి హైదరాబాద్ లోని ఎన్. సి. సి శిక్షణ కేంద్రంలో ఇచ్చే శిక్షణ ను మంగ ఇటీవలే పూర్తి చేసుకున్నారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పెరెడ్ కు చేని మంగ ఎంపికైన సందర్బంగా భాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, విశ్వ ప్రసాద్, నిరంజన్, రవికుమార్, కృష్ణ ప్రసాద్, అజయ్ బాబు, సాగర్, వేణు తోపాటు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.