చర్చ: రామ గిరి: బ్లాక్ కాంగ్రెస్, మండల పార్టీ అధ్యక్షులను కలిసిన జల్లారం సర్పంచ్
రామగిరి మండలంలోని జల్లారం సింగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ యమున శ్రీనివాస్ , మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రొడ్డ బాపు ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక సమస్యల పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సహకరించాలని సర్పంచ్ కోరారు.
దీనికి స్పందించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ , గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ భేటీ ద్వారా స్థానిక నాయకత్వం మధ్య సమన్వయం మరింత బలపడటం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగం పెరగడం వంటి సానుకూల ఫలితాలు కనిపించనున్నాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.