News & Views

చర్చ , కరీంనగర్ఐ:పీఎల్‌కు కరీంనగర్‌ యువకుడు..

 

ఐపీఎల్‌కు కరీంనగర్‌ యువకుడు..

చర్చ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి:- కరీంనగర్ నగరానికి చెందిన పేరాల అమన్ రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌కు ఎంపికయ్యారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడనున్న అమన్, ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-19, అండర్-23 విభాగాలలో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా, అండర్-23 ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్‌లో 160కు పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించారు. సౌత్ ఏషియన్ క్రికెట్ అకాడమీ నుండి శిక్షణ పొందిన 12వ గ్రాడ్యుయేట్ అమన్, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగి అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 52 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 6 అడుగుల 6 అంగుళాల పొడవున్న అమన్ సీమ్ బౌలర్‌గా రాణిస్తున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ 2026 సీజన్ చివరి వరకు రూకీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఐపిఎల్ లో ఆడనున్న అమన్ రావు కరీంనగర్ జిల్లా పేరును నిలబెట్టాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.