చర్చ, భద్రాచలం: కరుకు ప్రసాద్ బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు! మానవ హక్కుల సంస్థ నేతలు అభినందనల!

చర్చ,భద్రాచలం:
కరుకు ప్రసాద్ బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు!
మానవ హక్కుల సంస్థ నేతలు అభినందనల!
తిరుపతిలో జరిగిన
బహుజన సాహిత్య అకాడమీ కార్యక్రమంలో భద్రాచలం-గోదారి ప్రాం తంలోని ప్రముఖ సామాజిక సేవకుడు కరుకు ప్రసాద్కు “బెస్ట్ సోషల్ వర్కర్” అవార్డు లభించింది. కరుకు ప్రసాద్ గోదారి వరదల సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ధీరుడిగా ప్రసిద్ధి చెందాడు. భద్రాచ లం ప్రాంతంలో వరదలు తీవ్రంగా పెరిగినప్పుడు, ఆయన తన స్వంత ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించారు. అనేక మంది గోదావరి నదిలో చిక్కుకున్న సమయంలో, కరుకు ప్రసాద్ బోట్లలో వెళ్లి వారిని రక్షిత ప్రాంతాలకు చేర్చాడు. ఈ కృషితో అనేకమంది ప్రాణాలు మిగిలాయి, మరియు ఆ గ్రామాల్లో ఆయన ఒక ఆదర్శనీయ వ్యక్తిగా నిలిచాడు. భద్రాచలం మండలంలో పేదలకు ఆహారం, వస్త్రాలు, వైద్య సహాయం అందించడం కాకుండా, విద్య, ఆరోగ్యం, పర్యావరణ సమస్యలపై అవ గాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి అధికారులు మరియు కమ్యూనిటీతో కలిసి పోరాడి, ప్రాంతీయ అభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్నారు. ఈ సేవలకు గుర్తిం
పుగా బహుజన సాహిత్య అకాడమీ ఆయనకు అవార్డు ఇచ్చింది. అవార్డు అందుకున్న సందర్భంలో భారతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నేషనల్ చైర్మన్ కేశవరావు, నేషనల్ డైరెక్టర్ గణపతి, స్టేట్ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి కరుకు ప్రసాద్ను అభినందించారు. అవార్డు స్వీకరించిన తర్వాత కరుకు ప్రసాద్ మాట్లాడుతూ ఇది నా వ్యక్తిగత విజయం కాదు, భద్రాచలం ప్రజల అంకిత భావం ఫలితం. ముందుగా సేవ చేయాలి, అవార్డులు తరువాత వస్తాయి అని పేర్కొన్నారు.