News & Views

చర్చ, ఖమ్మం: రూ. 40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం ఎంపీ

రూ. 40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఉమ్మడి జిల్లాల్లో 125 మందికి లబ్ధి

చర్చ ఖమ్మం ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు.. తన సిఫారసుతో మంజూరైన 125 సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి బుధవారం నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. తద్వారా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల లబ్ధిదారులకు రూ.40లక్షల మేరకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని అన్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం ఇప్పటికే అనేకమందికి ఎల్ ఓ సి లు మంజూరు చేసామని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ది కలిగేలా కృషి చేస్తానని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మానుకొండ రాధాకిషోర్, మద్ది మల్లారెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, పలువురు కార్పొరేటర్లు, ప్రజా సంఘాల బాధ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.