చర్చ, కరీంనగర్: వైభవంగా కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం

కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. కిసాన్ గ్రామీణ మేళా ప్రారంబించడంతో పాటు అనేక యంత్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్ ను సందర్శించారు.
రైతులు సంఘటితంగా మారాలని, సంఘటిత మార్పు ద్వారానే వారి ఉత్పత్తులను వారు వస్తు మార్పిడి చేసి అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని దత్తాత్రేయ తెలిపారు. రైతులు తమ భూముల భూసార పరీక్ష చేసుకొని తగిన మోతాదులో ఎరువులు వాడటం వలన అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. కొత్త కొత్త ఆవిష్కరణ రైతులు అందుబాటులో తీసుకురావాలని, అధిక ఉత్పత్తి సాధించే వంగడాలను సాగు చేసుకోవడం వల్ల రైతులు అధిక లాభాలు గడిచే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని దాని కారణంగానే పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతుందన్నారు. గ్రామాలు కూడా స్వావలంబన కేంద్రాలుగా మారాలని అప్పుడే దేశ ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుందని తెలిపారు.
కిసాన్ జాగరణ అధ్యక్షులు ఈ కిసాన్ గ్రామీణ మేళా నిర్వాహకులు పోల్సాని సుగుణాకర్ రావు గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందన్నారు. అభివృద్ధి ఫలాలు గ్రామ ప్రజలకు అందటం లేదని, దాని మూలంగా యువత వ్యవసాయ రంగం వైపు, చేతివృత్తుల పైపు మరలకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వైపు నగరాలకు వలసలు వెళ్తున్నారని ఈ పరిణామం రాబోయే రోజుల్లో దుష్పరిణామాలకు దారితీస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజికపరంగానే కాక, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి, చైతన్యపరచటకు కిసాన్ జాగారణ 2022, 23లో ఈ సంవత్సరంలో కూడా కిసాన్ గ్రామీణ మేళాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. నూతన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని, అధిక ఉత్పత్తి చేసే విత్తనాలు, నూతన పద్ధతులు ద్వారా అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని, ఆ అధిక పంటలు పండించుకునేందుకు రైతులను చైతన్యపరిచే లక్ష్యయమే కిసాన్ గ్రామీణ మేళా అని తెలిపారు. గ్రామీణ ప్రజలు ముఖ్యంగా యువకులు వ్యవసాయం పట్ల ఆసక్తి చూపటం లేదని దానివల్ల వ్యవసాయ రంగము తీవ్రంగా నష్టపోతుందని అవేదన వ్యక్తం చేశారు. యువత కూడా వ్యవసాయ రంగం వైపు ఆకర్షితులను చేయడమే ఈ కిసాన్ గ్రామీణ మేళా లక్ష్యం అని తెలిపారు.
గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కొరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించడం ఎంతో అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ, మేజర్ డాక్టర్ రాజేశ్వర రావు అన్నారు. వ్యవసాయాన్ని కూడా లాభదాయకంగా మార్చాలనే ప్రయత్నమే ఈ కిసాన్ గ్రామీణ మేళా అని, ఇలాంటి గ్రామీణ మేళాలు, రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు మరిన్ని జరపవలసిన అవసరం ఉందని
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ డైరీ 12000 సభ్యత్వంతో ప్రారంభమై ఈరోజు లక్షకు పైగా సభ్యులతో తెలంగాణలోనే అత్యధిక పాలు, పాల ఉత్పత్తులు వ్యాపారం చేస్తే సంస్థగా ఎదిగిందని కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు. రైతులను మరియు పశు పోషణను ప్రోత్సహించాలని కిసాన్ గ్రామీణ మేళా నిర్వహిస్తున్నారని, చేపల పెంపకం గొర్రెల పెంపకం, డైరీ రైతులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, ఎంపీఓ అధ్యక్షులు, పిఎసిఎస్ అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.