News & Views

చర్చ, అశ్వారావుపేట: అరటి తోట వివాదంలో కత్తులతో దాడి

అరటి తోట వివాదంలో కత్తులతో దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఓ పొలం వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తసిక్తం అయింది.

ఓ ఐదెకరాల పొలంను శ్రీ హరి అనే వ్యక్తి వద్ద నారవారిగూడెం గ్రామానికి చెందిన మంగా వెంకటేశ్వర్లు మంగా గణేష్ అనువారలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిలో అరటి తోట కూడా వెయ్యడం జరిగింది. ఈ క్రమంలో అరటి తోట వేసిన భూమి తమదేనంటూ అదే గ్రామానికి చెందిన గేదెల విష్ణు తమ వద్దనున్న ఆధారాలు చూపిస్తున్నారు. రెండు వర్గాల మధ్య పొలం మాదంటే మాదని ఘర్షణ పడుతూ పోలీసులను ఆశ్రయించారు. మూడు నెలలుగా వీరి భువివాదం ఓ కొలిక్కి రాలేదు.

ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న తర్వాత గేదెల విష్ణు తన కుమారుడు గేదెల సురేషు అరటి తోటను నరికి వేశారని మంగ వెంకటేశ్వర్లు, మంగ గణేష్ లు ఆరోపిస్తూ చేను వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ముందుగానే పొలంలో ఉన్న గేదెల విష్ణు కుటుంబ సభ్యులతో మాట్లాడే క్రమంలో ఇరువర్గాలు ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. కర్రలతో కొట్టుకోవడంతో గొడవ తారస్థాయికి చేరడంతో గేదెల విష్ణు మనవడు గేదెల వినయ్ కత్తితో మంగా వెంకటేశ్వర్లు మంగా గణేష్ పై ఇరువురిపై దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇద్దరి తలలకు గట్టి దెబ్బలు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఇద్దరూ కుప్పకూలిపోయారు వెంటనే అక్కడే పడిపోయిన ఇద్దరినీ హుటాహుటిన అశ్వారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ ఖమ్మం తరలిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.