News & Views

చర్చ, కొత్తగూడెం : కొత్తగూడెంలోని ప్యూన్ బస్తీలో గల మస్జీదె సలాం మసీదులో ఘనంగా జరుపుకున్న లైలా తుల్ ఖాదర్ వేడుకలు

 

చర్చ, కొత్తగూడెం:

*కొత్తగూడెంలోని ప్యూన్ బస్తీలో గల మస్జీదె సలాం మసీదులో ఘనంగా జరుపుకున్న లైలా తుల్ ఖాదర్ వేడుకలు .*

కొత్తగూడెం పట్టణంలోని సోమవారం రాత్రి ప్యూన్ బస్తీలో గల మస్జీద్ సలాం మసీదులో లైలతుల్ ఖదర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ పండుగ మాసంలో ఈ రోజు ఖురాన్ అవతరించిన సందర్బంగా మసీదులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో మసీదుకు చేరుకుని ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి అల్లాహ్‌ను ప్రార్థించారు. రాత్రి పొడవునా ప్రార్థనలు, ఖురాన్ పారాయణం మరియు దువాలు నిర్వహించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు.మసీదు కమిటీ సభ్యులు భక్తులకు సదుపాయాలు కల్పించి ఏర్పాట్లు చేశారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం గురువులకు సన్మానాలు చేసి ప్రత్యకంగా అభినందించారు.మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ద్వారా చిన్న పిల్లలకు గిఫ్ట్ లు ఇవ్వడం జరిగింది.