News & Views

చర్చ జగిత్యాల : ట్రాన్సలేట్ క్షయ వ్యాధి నివారణలో భాగస్వాములవుదాం.- జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్.

క్షయ వ్యాధి నివారణలో భాగస్వాములవుదాం – జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్.

చర్చ, జగిత్యాల: క్షయ వ్యాధి నివారణ సాధ్యమని మందులతో క్షయ వ్యాధిని నివారించవచ్చని అందరం క్షయ వ్యాధి నివారణలో బాగాస్వాములుదామని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.
గురువారం మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ చాంపియన్లకు క్షయ వ్యాధి నిర్మూలనలో తోడ్పాటు అందించడానికి స్వచ్ఛంద సంస్థ సహకారంతో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్షయ మహమ్మారి వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, సరియైన పద్ధతిలో మందులు వాడితే ప్రాణాపాయాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. గతంలో చికిత్స తీసుకొని నయమైనటు వంటి పేషెంట్లను టీబీ ఛాంపియన్స్ గా గుర్తించి వారందరిని క్షయ నిర్మూలనలో భాగస్వాములను చేయడమే ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ శ్రీనివాస్, డాక్టర్ మౌనిక, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.