చర్చ, జగిత్యాల: రేపటి తరాన్ని డ్రగ్స్ నుంచి రక్షిద్దాం__జగిత్యాల డీఎస్పీ రఘు చందర్
రేపటి తరాన్ని డ్రగ్స్ నుంచి రక్షిద్దాం – డీఎస్పీ రఘు చందర్
చర్చ, జగిత్యాల: రేపటి యువతరాన్ని డ్రగ్స్ మహమ్మారీ నుంచి దూరం చేసి యువత ను రక్షిద్దా మని జగిత్యాల డి. ఎస్ పి రఘు చందర్ అన్నారు. మంగళవారం గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతర ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఈ జాతరలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. సుమారు నెలరోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరను దృష్టిలో ఉంచుకొని, జగిత్యాల జిల్లా పోలీసులు సమగ్ర భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. జాతర ప్రాంతానికి భారీగా చేరుకునే భక్తులలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, రవాణాపై అవగాహన పెంచడానికి, జిల్లా పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకుగాను, జాతర ప్రాంతానికి చేరుకునే ఆటో రిక్షాలపై “మాదక ద్రవ్యాల నిర్మూలన—మనందరి బాధ్యత” అనే సందేశంతో ప్రత్యేక ప్రచార పోస్టర్లు అంటించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రహిత జిల్లాగా జగిత్యాలను మార్చాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు. జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి పౌరుడు సహకరించాలని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి, మల్యాల సీ.ఐలు రాంనర్సింహరెడ్డి, రవి, ఎస్సైలు కృష్ణసాగర్ రెడ్డి, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.