చర్చ, జగిత్యాల: రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత మంచి సేవ చేద్దాం- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జిల్లా…
రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత మంచి సేవ చేద్దాం
_జిల్లా ఎస్పి అశోక్ కుమార్_
- జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం_
చర్చ, జగిత్యాల: ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలలో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు.
బుధవారం నాటికి భారత రాజ్యాంగం ఆమోదించి 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యానికి మూలాధారం అని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని చెప్పారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ సూచించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సిబ్బందిచే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి శేషాద్రిని రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు, సైదులు ఆర్.ఎస్.ఐ లు, డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.