చర్చ ములుగు జిల్లా: నరసింహసాగర్ (మల్లూరు వాగు ప్రాజెక్టు) తూము మరమ్మత్తులు విజయవంతం – మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
నరసింహసాగర్ (మల్లూరు వాగు ప్రాజెక్టు) తూము మరమ్మత్తులు విజయవంతం
- మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు

మల్లూరు వాగు ప్రాజెక్టు (కుడి కాలువ తూము) లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు స్థానిక మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రత్యేక చొరవ మేరకు విశాఖపట్నం నుండి వచ్చిన నలుగురి బృందం తో గ్రామస్తుల సహకారంతో నిర్విరామంగా పని 3 రోజుల నుండి సాగింది, ప్రాజెక్టు వద్ద తలెత్తిన సమస్య అవుట్ ఫుట్ కు వెళ్లే మార్గంలో షట్టర్ గైడ్ ఊడి పడడంతో ఆ మార్గం గుండా వెళ్లవలసిన నీరు పూర్తిగా ఆగిపోయింది. ఆ షెటర్ను తీస్తే అటువైపు ప్రవహించే నీరు యధావిధిగా రైతుల పంట పొలాలకు నిర్విరామంగా వెళుతుంది.
అందుకుగాను ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రాజెక్టు వద్దే ఉంటూ యుద్ధ ప్రాతిపదికన చేసిన మరమ్మత్తు విజయవంతం అయింది . స్థానిక ఏ ఈ వలీమ్ మహమ్మద్ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తూ డ్రైవింగ్ టీం తో కలిసి పనిచేశారు.
ఆక్సిజన్ ట్యాంకులతో డ్యాము లోపలికి వెళ్లి షెటరును వెల్డింగ్ చేసి అండర్ వాటర్ లో కటింగ్ చేసి షట్టర్ ను యధావిధిగా నిర్మించారు. తలెత్తిన సమస్యను మూడు రోజులు అండర్ వాటర్ లో కష్టపడి రిపేరు చేశామని ఏఈ వలి మహమ్మద్ మరియు డైవింగ్ (ఎంకె అండర్ వాటర్ సర్వీస్) బృందం తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూజరి సమ్మయ్య, మల్లూరు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రం గారి సురేష్, ఈడుపుగంటి దేవేందర్ ఎక్స్ సర్పంచ్ ఎట్టి పాపారావు, పి ఎ సి ఎస్ చైర్మన్ కాడబోయిన నరేందర్. కొప్పుల మాణిక్యం, ఈర్ల సంతోష్, మైనేని భాను, కుదురుపాక శ్రీను, కాటబోయిన నరసింహారావు, మల్కం సారయ్య గడ్డి ఎల్లయ్య అన్నాల నరసింహారావు, బండి రాములు, ముద్దంగుల రాజు, ఎండి జావిద్, ఎంబట్టి నవీన్, జొన్న సంపత్ రెడ్డి, మంద కుమార్, ఛాతాల వలరాజ్, తదితరులు పాల్గొన్నారు.