చర్చ, లక్ష్మీదేవిపల్లి: సిసి రోడ్ నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు
సిసి రోడ్ నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు

సిసి రోడ్ నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు
చర్చ, లక్ష్మీదేవిపల్లి;
మంజూరైన రోడ్డు కాకుండా.. తక్కువ వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ను పనులు చేయకుండా స్థానికులు అడ్డుకున్న ఘటన ఇది. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామ పంచాయతీలో గత సెప్టెంబర్ 15వ తేదీన రూ.28 లక్షల అంచనా విలువతో పూనెం నర్సయ యఇంటి నుండి ఎస్.కె. కరీం ఇంటి వరకు, మాదిగబ్రోల్ రోడ్డు నుండి జజ్జర లింగయ్య ఇంటి వరకు, తాళ్లపల్లి రత్న ఇంటి నుండి గుమ్మడి సత్యవతి ఇంటి వరకు, అంతడబ్బుల కృష్ణ ఇంటి నుండి మహ్మద్ కరీం ఇంటి వరకు సీఆర్ఆర్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. అయితే శంకుస్థాపన సమయంలో 12 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాస్తామని అధికారులు చెప్పారని స్థానికులు పేర్కొన్నారు. కాని గురువారం రోడ్డు పనులు చేపట్టేందుకు వచ్చిన కాంట్రాక్టర్ కేవలం 10 అడుగుల వెడల్పుతో రోడ్డు పనులు చేపట్టడంతో స్థానికులు ఈ విషయమై కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ సమాధానం చెప్పకపోవడంతో స్థానికులు రోడ్డు పనులను అడ్డుకున్నారు. 12 అడుగుల రోడ్డు నిర్మించాలని, లేదంటే పనులు నిలిపివేయాలంటూ ఆందోళన చేశారు.