చర్చ, కొత్తగూడెం: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి*

చర్చ కొత్తగూడెం : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి*
*యాజమాన్యం పై మండిపడ్డ ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య*
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని ఏఐటీయూసీ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య కోరారు. కొత్తగూడెం శేషగిరిభవన్ లో మిరియాల రంగయ్య మాట్లాడుతూ. సింగరేణి సంస్థకు నూతన సి అండ్ ఎండీగా జ్యోతిబుద్ధ ప్రకాష్ రావడం చాలా సంతోషమే కానీ యాజమాన్యం కార్మిక సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.సి అండ్ ఎండీ స్థాయి మరియు డైరెక్టర్ స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న కార్మిక సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు,అదేవిధంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ లెవెల్,మరియు ప్రతి మూడు నెలలకు ఒకసారి సి అండ్ ఎండీ స్థాయి లెవెల్ లో గుర్తింపు సంఘంతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటినికూడా యాజమాన్యం వాయిదాలు వేస్తూ వస్తుందని యాజమాన్యం పై మండిపడ్డారు, కమిటీల పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణ లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తీవ్రంగా యాజమాన్యంపై మండిపడ్డారు.సొంత ఇల్లు పథకం, మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆదాయ పన్నును కోల్ ఇండియా తరహాలో యాజమాన్యమే భరించాలని కోరారు. డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి.రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా సహాయ కార్యదర్శి గట్టయ్య, ఎఐటియుసి నాయకులు చందయ్యా,తాతిదారులు పాల్గొన్నారు.