చర్చ,గోదావరిఖని: సిఐటియు మహాసభలను విజయవంతం చేయండి. – నాయకులు ,కార్యకర్తలకు సిఐటియు నేత మెండె శ్రీనివాస్ పిలుపు.
సిఐటియు మహాసభలను విజయవంతం చేయండి.
- నాయకులు ,కార్యకర్తలకు సిఐటియు నేత మెండె శ్రీనివాస్ పిలుపు.
సిఐటియు 18 వ అఖిల భారత మహాసభలను జయప్రదయాలని సోమవారం గోదావరిఖని ఆర్జీవన్ ఏరియాలో అన్ని గనులు, డిపార్ట్మెంట్స్, ఆఫీసులు కార్మిక నాయకుల ఇండ్లపై సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకూ విశాఖపట్నంలో జరగనున్నాయని ఇందుకోసం సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభ పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు., సిఐటియు పిలుపుమేరకు నాయకులు కార్యకర్తల వారి ఇండ్లపై జెండా ఎగురవేశారన్నారు. అలాగే ఆర్జీవన్ బ్రాంచ్ లోని జీడీకే వన్, 2, 2A, 11, సీఎస్పీ 1, ఓసిపి 5, ఏరియా వర్క్ షాపులో సిఐటియు నాయకులు కార్యకర్తలు పలుచోట్ల సిఐటియు జెండాలను ఎగురవేసినట్లు తెలిపారు. అఖిల భారత మహాసభల జయప్రదానికై కార్మికులు, పెద్ద ఎత్తున బహిరంగసభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మేదరి సారయ్య, ఆర్జీవన్ కార్యదర్శి మెండె శ్రీనివాస్, ఈ సాయ రెడ్డి, పి రాజేశ్వర చారి, యం రాజేశ్వరరావు, జెల్లా గజేంద్ర, ఉపాధ్యక్షులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్కే గౌస్, పుప్పాల శ్రీనివాసరావు, బూరుగుల రాములు, పెద్దపల్లి శశికిరణ్, ఈ సాగర్, అనబోయిన శంకరన్న, పెండెం సమ్మయ్య, వంగల శివరాం రెడ్డి, జి దుర్గాప్రసాద్, కొమ్ము రమేష్, ఈద వెంకటేశ్వర్లు, ఎస్ శ్రీనివాస్, నంది నారాయణ, జంగపల్లి మల్లేష్, పాటు తదితరులు పాల్గొన్నారు.