చర్చ,గోదావరిఖని: పిడిఎస్ యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి – పి డి ఎస్ యు జిల్లా నాయకుడు అవినాష్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ ) రాష్ట్ర 23వ మహాసభలను జనవరి 5,6,7 తేదీలలో వరంగల్ లో నిర్వహిస్తున్న సందర్భంగా
గోదావరిఖని లోని కాకతీయ జూనియర్ కాలేజీ ఆవరణలో పిడిఎస్ యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా పి డి ఎస్ యు జిల్లా నాయకుడు అవినాష్ మాట్లాడుతూ పి డి ఎస్ యూ విద్యార్థి సమస్యల పరిష్కారం కై పోరాటాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 1972లో ఉస్మానియా యూనివర్సిటీ లో జార్జిరెడ్డి నాయకత్వంలో పిడిఎస్ యూ ఆవిర్భావం జరిగిందని అన్నారు. నాటి నుండి నేటి వరకు విద్యార్థి హక్కుల కోసం, సామజిక, రాజకీయ పరిణామాల పై అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు.
అనేక నిర్భందాలు, అరెస్టులు,చిత్రహింసలను ఎదుర్కొని మొక్కవోణీ దైర్యంతో బలమైన సంస్థగా దేశవ్యాప్తంగా నిర్మాణం చెందిందని అన్నారు. ఈ నిర్మాణంలో జేసీఎస్ ప్రసాద్, శ్రీహరి, రంగవల్లి, కోలా శంకర్, మారోజు వీరన్న, చాంద్ పాషా లాంటి అనేక మందిని రాజ్యం, కిరాయి గుండాల చే హత్య చేయించిన పిడిఎస్ యూ నిర్మాణం ఆగలేదన్నారు. 50 ఏండ్ల పిడిఎస్ యూ ఉద్యమ ప్రస్థానంలో అనేక విజయాలను సాధించిందన్నారు.
గత ఉద్యమాలను సమీక్షించుకోని భవిష్యత్ పోరాట కర్తవ్యలను రూపొదించుకోవడానికి మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మహాసభలకు విద్యార్థిని, విద్యార్థులు అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు డి సాయిరాం, ఎస్.కె గుఫ్రాన్, రామ్ చరణ్, రక్షాబంధన్, గణేష్, కె సాయి వికాస్, కార్తికేయ, అర్జున్, శివ చరణ్, సిద్ధార్థ, పృథ్వీరాజ్, కృష్ణ చైతన్య, అరవింద్, విగ్నేష్, శివప్రసాద్.తదితరులు పాల్గొన్నారు.