చర్చ ,సింగరేణి : సమ్మెను జయప్రదం చెయ్యండి .

*సమ్మెను జయప్రదం చెయ్యండి .*
*వాల్ పోస్టర్ ను విడుదల చేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు*
చర్చ, సింగరేణి, కొత్తగూడెం
సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో యాజమాన్యం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సోమవారం పివికే 5 గనిలో లో జరిగిన వాల్ పోస్టర్ ను గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు విడుదల చేశారు.సింగరేణి యాజమాన్యం కొన్ని సమస్యల ను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించి ఇంత వరకు వాటిపై అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్ లు జారీ చేయలేదని ఎఐటియుసి నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికుల కు ఒక అవకాశం కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని కనుక భవిష్యత్తు కార్యాచరణ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు, ఏఐటియుసి ఈ నెల 17 నుండి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరియు ఏప్రిల్ లో జరగబోయే సమ్మె విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు, కావున జరగబోయే ఆందోళన కార్యక్రమంలో పివికే5 గని కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని సింగరేణి మనుగడను కాపాడాలని ఎఐటియుసి నాయకులు కోరారు, ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి భూక్యా రమేష్,పిట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నాగేశ్వరావు,అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సందీప్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ సాయి పవన్, రాంచందర్,సురేందర్ రెడ్డి, సంజీవ్, విక్రమ్, సుమన్, సంతానం, రామారావు, విజయ్,శ్రీను, శశి, భద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.