News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మల్లు నందిని విక్రమార్క

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మల్లు నందిని విక్రమార్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నందిని విక్రమార్కకి స్వాగతం పలికిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న,
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు