News & Views

చర్చ, జగిత్యాల: దత్తాత్రేయున్ని దర్శించుకొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దత్తాత్రేయున్ని దర్శించుకొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

చర్చ, జగిత్యాల: దక్షిణ కాశిగా ప్రసిద్ధి పొందిన ధర్మపురి లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఉదయం వేళల్లోనే దత్తాత్రేయుని దర్శనానికి వచ్చిన మంత్రి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు తీర్థ ప్రసాదాలను అందించారు.