News & Views

చర్చ, కొత్తగూడెం: గెలిచిన సర్పంచ్ లకు మంత్రి పొంగులేటి చిరు సన్మానం

గెలిచిన సర్పంచ్ లకు మంత్రి పొంగులేటి చిరు సన్మానం

గురువారం కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీను క్యాంపు కార్యాలయ ఆవరణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, అశ్వరావుపేట, పినపాక నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నూతనంగా గెలిచిన సుమారు 369 మంది సర్పంచులకు మరో 396 మంది ఉపసర్పంచ్ లకు రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలపి, గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా శక్తివంచన లేకుండాపనిచేయాలని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తూము చౌదరి, డిసిసి అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, నాగ సీతారాములు, పూణెం శ్రీనివాస్, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎం.డి. గౌస్ పాషా, రైల్వే బోర్డు మెంబర్ వైయస్ శ్రీనివాస్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్, సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు