చర్చ, సత్తుపల్లి : శివాలయాన్ని దర్శించుకున్న మంత్రి తుమ్మల
శివాలయాన్ని దర్శించుకున్న మంత్రి తుమ్మల….
చర్చ, సత్తుపల్లి :
సత్తుపల్లి పట్టణంలో గల గుడిపాడు దుర్గా పార్వతీ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు, దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మంత్రి తుమ్మలను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, కొల్లి నరసింహారావు, చల్లగుల్ల కృష్ణయ్య, నున్న రత్నాకర్, గాదె చెన్నారావు పాల్గొన్నారు.