News & Views

చర్చ , హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుకు తప్పిన మరో ఘోర రోడ్డు ప్రమాదం!

ఆర్టీసీ బస్సుకు తప్పిన మరో ఘోర రోడ్డు ప్రమాదం!

చర్చ , హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుకు తప్పిన మరో ఘోర రోడ్డు ప్రమాదం!

హైదరాబాద్, నవంబర్ 07(చర్చ):
వరస రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నా యి ఇప్పటికే చేవెళ్ల బస్సు, టిప్పర్, ప్రమాదం మిగిల్చిన విషాదం మరవక ముందే మరికొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను భయాందో ళనకు గురి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శుక్రవారం ఉదయం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారి పై ఆరాంఘర్ కూడలి వద్ద ఆర్టీసీ బస్సును అదుపు తప్పి డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో బస్సులోని ప్రయాణీకులు హహాకా రాలు చేశారు. స్థానికుల కథనం ప్రకారం…

షాద్ నగర్ డిపోకు చెందిన టిఎస్07యుఎం-0713 నంబరు గల బస్సు శుక్రవారం ఉదయం ప్రయాణీకులతో ఆరాంఘర్ కు వచ్చింది. ఆరాంఘర్ ఆగిన బస్సు ను ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ పడడంతో డ్రైవర్ ముందుకు నడిపాడు.

అదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన కెఎ29సి- 2138 నంబరు గల డిసిఎం లారీ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. బస్సు వేగంగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

ఒక్కసారిగా జరిగిన సంఘటనలో ప్రయాణీ కులు హహాకారాలు చేశారు. అది గమనించిన స్థానికులు ప్రయాణీకులను రక్షితంగా కిందకు దింపారు. గాయపడిన ప్రయాణికు లను ఆస్పత్రికి తరలిం చారు. ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.