News & Views

చర్చ, జగిత్యాల : ఉత్తమ విద్యార్థులను ప్రశంసించిన ఎమ్మెల్యే డా. సంజయ్

 

ఉత్తమ విద్యార్థులను ప్రశంసించిన ఎమ్మెల్యే డా. సంజయ్

చర్చ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం ఫలితాలలో డిస్ట్రింక్షన్ పాసైన విద్యార్థులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రశంసించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల లో నిర్వహించిన ఇండక్షన్, వైట్ కోట్ సెర్మనీ ప్రాగ్రాం లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటి సంవత్సర మెడికల్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రశంసించి మెడల్స్ అందించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ను నిర్వాహకులు శాలువాతో, మేమేంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా.సునీల్, సూపరిండెంట్ డా.కృష్ణ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అర్చన,
ప్రొఫెసర్స్ హెచ్.ఓ.డి లు, మెడికల్ విద్యార్థులు, తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు