News & Views

చర్చ, కరీంనగర్: పంచాయతీ ఎన్నికల్లో కబ్జాకోర్లకు గుణపాఠం చెప్పాలి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పిలుపు

ప్రభుత్వ, ప్రైవేటు,అసైన్డ్ భూముల కబ్జాలతో గ్రామాల్లో అరాచకాలకు పాల్పడ్డోళ్లకు పంచాయితీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు

శుక్రవారం మానకొండూర్, మండలంలోని ఊటూరు, ముంజంపల్లి,
చెంజర్ల, పెద్దూరుపల్లి, గంగిపల్లి, కెల్లేడు, పోచంపల్లి,వేగురుప ల్లి, లక్ష్మిపూర్, వెల్ది,జగ్గయ్యపల్లి,శ్రీనివాస్ నగర్,రాఘవాపూర్,మానకొండూర్ గ్రామాల్లో పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ సర్పంచులు గ్రామాల్లో అరాచకాలు సృష్టించారని, ప్రభుత్వ అసైన్డ్ భూములే కాకుండా ప్రైవేట్ భూములను కబ్జా చేసి అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వారిని మళ్లీ మనం ఎన్నుకుంటే అగచాట్లు తప్పవని ఆయన హెచ్చరించారు. కబ్జాకోరులను అవినీతిపరులను పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన కోరారు.

గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న వారిని సర్పంచులుగా వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని కవ్వంపల్లి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక హామీలను అమలు చేసిందని ఆయన చెప్పారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిందని, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ఇప్పటివరకు మూడు పర్యాయాలు వడ్డీ లేని రుణాలను అందించినట్టు ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, కొత్త రేషన్ కార్డులకు కోసం ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, కుటుంబ సభ్యుల అదనపు పేర్ల నమోదుకు పెసలు బాటు కల్పించిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే యువతకు 65 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలని ఉద్దేశంతో 200 కోట్లతో నియోజకవర్గాని కో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.

  • తొలి విడుత తీర్పుతో ప్రజల విశ్వాసం చూరగొన్నారు

తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజామోదం పొందామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.తొలి విడుత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వచ్చాయని, ఈ తీర్పుతో ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నట్టుగా తేటతెల్లమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని, అందుకే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. మలివడత పంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్ వైపే ముగ్గు చూపుతారని ఆశాభవాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు వెలిశెట్టి కళ్యాణి -కిషోర్ఊటూరు,నందగిరి కనకలక్ష్మీ- రవీంద్రాచారి (ముంజంపల్లి), గొల్లెన కనకమ్మ- కొమురయ్య,
రామగిరి హరీష్(పెద్దూరుపల్లి),వాల అంజుత్ రావు(గంగిపల్లి), రాగుల లక్ష్మీ- కుమార్(కెల్లెడు), దాసరి శ్రీనివాస్ (పోచంపల్లి), మందల మల్లారెడ్డి( వేగురవెల్లి), మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, మాజీ ఎంపీటీసీ గోపు శ్రీనివాస్ రెడ్డి, బొంగని సునీల్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మోతె సదయ్య. గడ్డం రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.