News & Views

చర్చ, జగిత్యాల :పెన్షనర్ భవన్లో అదనపు గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

పెన్షనర్ భవన్లో అదనపు గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా పెన్షనర్స్ భవన్ లో నూతనంగా నిర్మించిన అదనపు గదితోపాటు లిఫ్ట్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంబించారు. అనంతరం స్థానిక గార్డెన్స్ లో పెన్షనర్స్ ను ఎమ్మెల్యే సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరబుజ రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ కుమార్, కోశాధికారి గుండెటి గంగాధర్, నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాత్ సింగ్ ఠాగూర్, ప్రవీణ్ రావు,
జిల్లా అర్బన్ యూనిట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.