చర్చ , పాల్వంచ : జ్యోతిరావు పూలే గురుకుల కేటీపీఎస్ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
జ్యోతిరావు పూలే గురుకుల కేటీపీఎస్ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

జ్యోతిరావు పూలే గురుకుల కేటీపీఎస్ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ
పాల్వంచ: కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు పట్టణ పరిధిలోని జ్యోతిరావు పూలే బాలికల గురుకులం, కేటీపీఎస్ ప్రాథమికో ఉన్నత పాఠశాల ను ఆకస్మికంగా అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అక్కడ ఉన్న వసతులు, భోజనం తరగతి గదులను కలయ తిరుగుతూ విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి పాఠాలను తమ మెదడులోకి ఎక్కించుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, నిత్యం సామాజిక పరిస్థితులు ప్రపంచంలో వస్తున్న మార్పులు పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పట్ల పూర్తి పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. తల్లితండ్రులు కాయ కష్టం చేసుకుంటూ వారు పడుతున్న బాధలు తమ పిల్లలకు రావద్దని సరైన విద్య అందించడానికి నిత్యం పరితపిస్తూ ఉంటారని తల్లితండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అంకితభావంతో తల్లితండ్రుల స్థానాన్ని తీసుకొని సమాజ పట్ల వారి భవిష్యత్ పట్ల సరైన సలహాలు సూచనలు ఇస్తూ వారి ఉన్నత కోసం కృషి చేయాలని, విద్యార్థులకు అందవలసిన పౌష్టికి ఆహారం, వసతులు పట్ల నిర్లక్ష్యం వహించకుండా నాణ్యత పాటిస్తూ నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పనకు తన సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా సీఐ సతీష్, ఎస్సై లు సుమన్, జీవన్ రాజ్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, అడుసుమిల్లి సాయిబాబా ఉప్పుశెట్టి రాహుల్, ఎంఈఓ రామ్మూర్తి పాఠశాల ప్రిన్సిపల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.