చర్చ, జగిత్యాల: కోటి రూపాయల డ్రైనేజీ పనికి ఎమ్మెల్యే శంకుస్థాపన
చర్చ, జగిత్యాల: కోటి రూపాయల డ్రైనేజీ పనికి ఎమ్మెల్యే శంకుస్థాపన
జగిత్యాల పట్టణం లోని కరీంనగర్ రోడ్డు లో ఓక కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ డ్రైనేజీ కొత్త బస్టాండ్ నుంచి నర్సింగ్ కళాశాల రోడ్డులో నర్సింగ్ కళాశాల దారిలో నిర్మాణం జరిగితుందన్నారు. ప్రధాన రహదారిపై డ్రైనేజీ లేకపోవడం తో సమస్య లు తలెత్తుతున్నాయన్నారు. అలాగే 20 వ వార్డులో 20 లక్షల డ్రైనేజీ పనిని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, డిఈ ఆనంద్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,గోలి శ్రీనివాస్, అడువల లక్ష్మణ్ మాజీ, కౌన్సిలర్లు అనుమల్ల కృష్ణ హరి, శ్రీలత రామ్మోహన్ రావు, జంబర్తి రాజ్ కుమార్, మహేందర్, మున్సిపల్ సిబ్బంది పట్టణ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.