చర్చ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మోడీ, బీజేపీ, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై దేశవ్యాప్త కుట్ర – ఆర్ఎస్ రత్నాకర్
చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం
మోడీ, బీజేపీ, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై దేశవ్యాప్త కుట్ర ఇది చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర!!
మిత్రులారా అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్,
దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం, దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం, దేనికి నిదర్శనం? రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతా ఉందా?
ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి, ఈ యొక్క సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకుల్లోనేనా? ఈ దేశ సంపద, ముఖ్యమంత్రి పదవి,,మంత్రి పదవులు ఈ దేశ పరిశ్రమలు జడ్జెస్ నియామకాలు, పరిశ్రమల్లో అక్కర్లేదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి..
నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోంది, ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు? అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను, చంద్రబాబు మాల సామాజిక వర్గం పై ప్రగతించుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలపై తనకు ఏ విధమైన ఈర్ష ద్వేషాలు ఉన్నాయో చేసి చూపించాడు, మాలల హోల్సేల్ మేనమామ మాలలకు అన్యాయం జరుగుతున్న ముద్దులతో సరిపెట్టేసాడు తప్ప ఈనాటికీ స్పందించలేదు,
ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా, ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే, తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం, ఘోరం అన్యాయం, చెంచా గిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి,
రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగుల రా మాల జాతిని తొక్కేస్తా ఉన్నారు ఇకనైనా కళ్ళు తెరిచి బయటకు రండి మా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండి, తెలుగు రాష్ట్రాల్లో ఏ నాడు ఎదుర్కొనటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటూ ఉంది, పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయాం , శాంతియుత పోరాటానికి సిద్ధం కండి మిత్రులారా