కమాన్ పూర్: పెంచికల్ పేట్ లో కోతి దాడి..
పెంచికల్ పేట్ లో కోతి దాడి..
- తీవ్రంగా గాయపడిన మహిళ..!
కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మి అనే మహిళ కోతి దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ మహిళను కమాన్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకరాగా ప్రథమ చికిత్స అనంతరం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు సమాచారం. ఇప్పటికే పెంచికల్ పేట్ గ్రామంలో సుమారు 50 మంది వరకు కోతుల దాడిలో గాయపడినట్లు తెలిసింది. కోతుల బెడదా తీవ్రంగా ఉందని.. కోతుల బారినుండి తమను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలను ప్రజలు కోరుతున్నారు.