చర్చ, జగిత్యాల: ఆల్ఫోర్స్ కళాశాలపై విచారణ చేపట్టండి – జిల్లా ఇంటర్ అధికారికి ఫిర్యాదు చేసిన ముకేష్ కన్నా
జిల్లా ఇంటర్ అధికారికి ఫిర్యాదు చేసిన ముకేష్ కన్నా

ఆల్ఫోర్స్ కళాశాలపై విచారణ చేపట్టండి
జిల్లా ఇంటర్ అధికారికి ఫిర్యాదు చేసిన ముకేష్ కన్నా
చర్చ, జగిత్యాల: జగిత్యాలలోని ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తూ, విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తోందని వెంటనే విచారణ చేపట్టాలని పీసీసీ సేవాదల్ సెక్రటరీ బాగోజీ ముకేశ్ కన్నా జగిత్యాల జిల్లా ఇంటర్మిడియట్ అధికారి నారాయణకు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. బుధవారం జగిత్యాల లోని డి.ఐ.ఈ.వో కార్యాలయానికి వెళ్లిన ముకేశ్ కన్నా ఫిర్యాదు చేశారు. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అధిక ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. సరైన వసతులు కల్పించకుండా, ప్రభుత్వ నిభందనల ప్రకారం కళాశాలను నిర్వహించడంలేదని ఫిర్యాదు లో పేర్కొన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తున్న అల్ఫోర్స్ కళాశాల నిర్వహణ తీరుపై, విద్యార్థులను ఫీజ్ లకై వేదిస్తున్న విషయాలపై విచారణ చేపట్టాలని ముకేశ్ కన్నా కోరారు. అయన వెంట రాహుల్, రాజు, ప్రకాష్, అరుణ్, సునీల్ తదితరులు ఉన్నారు.