News & Views

కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇన్చార్జిగా మురళి – నియామక పత్రం అందజేసిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్

కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇన్చార్జిగా మురళి

నియామక పత్రం అందజేసిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్

చర్చ, సత్తుపల్లి:

సత్తుపల్లి సింగరేణిలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ యూనియన్ కృషి చేస్తుందని తెలియజేస్తూ ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సత్తుపల్లిలో యూనియన్ బలోపేతానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సత్తుపల్లి ఇన్చార్జిగా గాదే మురళీ కృష్ణను నియమించి నియామక పత్రాన్ని అందజేసిన వైస్ ప్రెసిడెంట్ రజాక్. రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి సంస్థ లాభాలలో మొదటి సంవత్సరం 5000 , రెండవ సంవత్సరం 5,500 రూపాయలు ఇప్పించిన ఘనత ఐఎన్టీయూసీ యూనియన్ అని తెలియజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమలో నాయకులు క్రాంతి కుమార్, రామారావు, బాలాజీ,పోచం శ్రీనివాస్, మల్లారపు కొమరయ్య, కొలుగూరి వెంకటస్వామి , బాజీ , రవిశంకర్ , ఖాజా , చాంద్ , ఐ వి రెడ్డి , శ్రీధర్ , సురేష్ , శ్రీనివాస్ , సందీప్ , దావూద్ , రాము , రాంబాబు , శ్రీధర్, అఫ్రోజ్, పాషా , రాజశేఖర్, కిరణ్ , గోపి , విజయ్ , శుభానీ,వీరబాబు, రాజేష్,ప్రసాద్, సత్యం,sk శుభానీ,L శ్రీను లోకేష్, పవన్,k వెంకటేశ్వరావు, రమేష్, ఇతర ముఖ్య నాయకులు , కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.