చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: హతమార్చి ఆత్మహత్య చిత్రికరణ
పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ లో dsp సతీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు, అయన మాట్లాడుతు పట్టణ పరిదిలోని వెంగళరావు కాలనీ కి చెందిన ధరవత్ హరినాద్ వయస్సు 39 సంవత్సరాలు, వెంగళరావు కాలనీ లో నివాసి అతను తేది 15.12.2025 తెల్లవారుజామున సుమారు 02:00 గంటల సమయంలో, తన ఇంటి వెనుక భాగంలో స్లాబ్ కింద ఉన్న హుక్కు చీరతో ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మరణించగా, మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మృతుని భార్య శృతిలయ ములుగు జిల్లా, వాజేడు, వెంకటాపురం ఏరియాలో అటవీ శాఖలో బీట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తోందిఅని.గతంలో ఆమె చర్ల ఏరియాలో డ్యూటీ చేస్తున్న సమయంలో, అదే ఏరియాకు చెందిన కౌశిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణ ఉంది. ఈ విషయమై పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ, భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని, తన కొడుకు మృతికి తన కోడలు అయిన శ్రుతిలయ కారణం అయిఉంటుంది అని ఫిర్యాదు ఇవ్వగా అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా,విచారణలో మృతుని భార్య అయిన శృతిలయ ను విచారించగా పొంతనలేని సమాదానాలు చెప్పగా అనుమానంతో పూర్తి విచారణ చేపట్టగా విచారణలో ఇది హత్య చేసి ఆత్మహత్యగా నాటకం చేసిన కేసుగా గుర్తించాము . మృతుడు ధరవత్ హరినాద్ (39 సం.) ను అతని భార్య దరావత్ శ్రుతిలయ (36 సం.), తన ప్రియుడు కొండా కౌషిక్ మరియు అతని స్నేహితులు మోహన్, భానులతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి హతమార్చి, తరువాత ఎవరికి అనుమానం రాకుండా ఇంటి వెనుక భాగంలో స్లాబ్ హుక్కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు సృష్టిచడం జరిగింది అని తెలిపారు
నిందితులు:
1) దరావత్ శ్రుతిలయ W/o ధరవత్ హరినాద్, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి :ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నివాసం వెంగళరావు కాలనీ, పాల్వంచ,
(ఈమె ప్రస్తుతం ములుగు జిల్లా, వెంకటాపురం డివిజన్, పెనుగోలు సెక్షన్, పెనుగోలు బీట్లో విధులు నిర్వహిస్తోంది)
2) కొండా కౌషిక్ S/o వెంకటేశ్వర్లు(లేట్),31 సంవత్సరాలు,SC-మాల,వృత్తి:ప్రెస్ రిపోర్టర్, R/o లింగాపురం గ్రామం, చర్ల మండలం
3) చెన్నం మోహన్ S/o రోషయ్య,32 సంవత్సరాలు, R/o చర్ల ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా N/o ఎడ్జర్లపల్లి గ్రామం, వాజేడు మండలం,ములుగు జిల్లా
4) డేగల భాను S/o శ్రీనివాస రావు,23 సంవత్సరాలు, R/o రాయన్నపేట,ఏటపాక ,అప్పుడు
ఈ కార్యక్రమం లో dsp సతీష్ తో సీఐ సతీష్,పాటు si సుమన్, si కళ్యాణి, si జీవన్ పాల్గొన్నారు