చర్చ:- అశ్వారావుపేట , చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం,అంతర్రాష్ట్ర బోర్డర్ వద్ద ఉదయం పోలీస్ నాకాబంది…



చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం.
=> అంతర్రాష్ట్ర బోర్డర్ వద్ద ఉదయం పోలీస్ నాకాబంది.
=> వాహన తనిఖిలు చేసిన పోలీసులు.
డ్రగ్స్ వినియోగం మరియు రవాణాపై నియంత్రణ చర్యలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృత నాకాబంది నిర్వహించబడింది.
తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు సాగిన ఈ నాకాబందిలో వాహనాలను ఒక్కొక్కటిగా ఆపి పూర్తిస్థాయి తనిఖీలు చేశారు. ప్రతి వాహనంలోని ప్రయాణికుల వివరాలను సేకరించి, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో పరిశీలించారు. పోలీసులు ప్రధానంగా మత్తు పదార్థాల రవాణాపై దృష్టి సారించారు. పోలీసులు అంతర్రాష్ట్ర బోర్డర్ వద్ద మరియు భద్రాచలం రోడ్డులో పలు ప్రాంతాల్లొ తనిఖీలు చేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎస్సై యాయతి రాజు పోలీస్ సిబ్బంది పాల్గొని తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై యాయతిరాజు మాట్లాడుతూ
ప్రజల సహకారంతోనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించినా, రవాణా చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. యువత భవిష్యత్తు కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచుగా కొనసాగుతాయి అని తెలిపారు.