చర్చ , రామగిరి: రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానం
రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానం
చర్చ , రామగిరి:
మొదటి విడత స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన రామగిరి మండలంలోని నూతన సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు రామగిరి మండల కేంద్రంలోని సెంటేనరి కాలనీ టౌన్‌లోని INTUC శ్రీ పాద భవనంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రొడ్డ బాపన్న,సెంటేనరి కాలనీ టౌన్ అధ్యక్షులు కాటం సత్యం ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు. నూతన ప్రజా ప్రతినిధులకు శాలువాలు కప్పి ఆత్మీయ సత్కారం చేశారు.
మండలంలో 10 గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
-
- పన్నూర్ చిందం మహేష్ – ఉప సర్పంచ్, కావేటి మల్లేశ్వరి,
- నవాబ్‌పేట: సర్పంచ్ – రొడ్డ మౌనిక కుమార్ ఉప సర్పంచ్ – ;
- A లావణ్య లద్నాపూర్: వనం రామచంద్ర రావు; ఉప సర్పంచ్ – అడ్డూరి శ్రీకాంత్,
- రాజాపూర్: పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య; ఉప సర్పంచ్ –
- కలవేన శ్రీకాంత్ ఆదివారం పేట: సంజీవ్; ఉప సర్పంచ్ – మేకల సునీత శ్రీశైలం
- సుంద్ధిల్ల : ముస్కుల నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్: సదానందం
- లొంకా కేసారం: వీరగోని రమాదేవి శ్రీనివాస్,
- బేగంపేట:ఉప సర్పంచ్ సందెల రేణుక కుమార్
- నాగేపెల్లి: ఉప సర్పంచ్ – ఏ. సతీష్
- చందనాపూర్ ఉప సర్పంచ్: చిగురు రజిత
పలు గ్రామాల ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో సన్మానం పొందారు.
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ,
- రామగిరి మండలంలోని మొత్తం 16 గ్రామ పంచాయతీలకు గాను 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఒక గ్రామ పంచాయతీ కోర్టు స్టే కారణంగా వాయిదా పడిందని తెలిపారు.
- ఎన్నికలు జరిగిన 15 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 10 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడం జరిగిందని, ఇందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
మిగిలిన ఐదు గ్రామ పంచాయతీలలో నాలుగు గ్రామ పంచాయతీలు ఇతర పార్టీలకు, ఒక గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కినట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలపై సమగ్ర సమీక్ష అవసరమని, ఆయా గ్రామాలలో ఉన్న లోటుపాట్లను గుర్తించి రాబోయే ఎంపిటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్ అభ్యర్థులతో కలిసి, మండల పార్టీ అధ్యక్షులు బాపన్న గారి అధ్యక్షతన రెండు మూడు రోజుల్లో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. 23, 25 తేదీల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నందున, ఆలోపే లోటుపాట్లపై చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించాలని తెలిపారు. ఈ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను బాపన్న గారు సిద్ధం చేయాలని కోరారు.
గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్థికంగా బలపడగా, కాంగ్రెస్ పార్టీ తరఫున నిజాయితీగా పనిచేసిన అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయని, ఇది కూడా కొన్ని గ్రామాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని తెలిపారు. అయినప్పటికీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టేనని స్పష్టం చేశారు.
పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతుందని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందువల్ల గ్రామ స్థాయిలో ప్రజలతో మరింత మమేకమై పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని, పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచనల మేరకే అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహులు ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, పార్టీ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.
పన్నూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో సహకరించిన గణపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఆయన పోటీ నుంచి తప్పుకోవడం వల్లే భారీ మెజారిటీతో గెలుపు సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే ముస్త్యాల వంటి గ్రామాల్లో కూడా పార్టీ నాయకులు ఓపికతో వ్యవహరించి ఉంటే విజయం సాధ్యమయ్యేదని వ్యాఖ్యానించారు.
రాబోయే ఎంపిటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేయస్సు కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని, అవకాశాలు రాని వారు ఓపికతో ఎదురుచూస్తే భవిష్యత్తులో తప్పకుండా అవకాశాలు వస్తాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు అన్ని విభాగాల నాయకులు మహిళా లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.