చర్చ, సత్తుపల్లి: నీలాద్రి అర్బన్ పార్కు వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్టు, రిమాండ్…..
సత్తుపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ వేటకార్యకలాపాలుజరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా, జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు డిఎఫ్ ఒ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఐఎఫ్ ఎస్ అండ్ ఎఫ్ డిఒ మంజుల,ఎసిఎఫ్ నేతృత్వంలో సంయుక్తంగా ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడులలో, అధికారులు నేరస్థులను గుర్తించి అరెస్టు చేశారు, అక్రమ వేటకు సంబంధించిన కీలక ఆధారాలను పొందారు.
అరెస్టు మరియు కేసుల నమోదు
—–
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను 01.12.2025 న ఎ.1) పంతంగి గోపీకృష్ణ, తండ్రి వేంకటేశ్వర రావు, ఎ.3) సొంటి శ్రీరామ్ ప్రసాద్, తండ్రి నారాయణ లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మిగితా ఇద్దరినీ శుక్రవారం రోజు 05.12.2025 న అరెస్టు చేసి, అరెస్టు చేసిన నిందితులను సత్తుపల్లి ఎఫ్‌డిఓ కార్యాలయంలో హాజరుపరిచి, చట్టపరమైన విధానాల ప్రకారం కోర్టులో హాజరుపరిచారు .
ఎ.2) మెచ్చా రఘు, తండ్రి మెచ్చా నాగేశ్వరరావు
ఎ.4) కుంజా భరత్, తండ్రి మహేష్ లను
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అండ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సత్తుపల్లి ఆదేశాల మేరకు నిందితులను 05.12.2025 న రిమాండ్‌కు తరలించారు.
టిజి ఫారెస్ట్ యాక్ట్–1967, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్–1972లోని సంబంధిత విభాగాల కింద నిందితులపై కేసులు నమోదు చేయబడ్డాయి.అటవీ శాఖ సిబ్బంది మరియు టాస్క్‌ఫోర్స్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిఎఫ్‌ఓ విజ్ఞప్తి
——
అక్రమ వేట, అడవి జంతువులను చంపడం మరియు అటవీ వనరులను నాశనం చేయడం వంటి చర్యలపై అటవీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని డిఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఐఎఫ్‌ఎస్, ఖమ్మం తెలిపారు.అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.