చర్చ తెలంగాణ : లెక్క తెలియని కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య
కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య తేలడం లేదు

చర్చ హైదరాబాద్ :
లెక్క తెలియని కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య
తెలంగాణ : కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య ఎప్పటికి తేలేలా లేదు. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యపై కొలిక్కి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి . పైగా ఒక్కక్కరు ఒకే పేరు మీద రెండు నుండి మూడు వేతనాలు తీసుకుంటున్నారు. దీనితో ప్రభుత్వంపై వేతన భారం కూడా పడుతుంది కాబట్టి ఏ ఏ శాఖల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? వారికి జీతం ఎంత? ఎన్ని నెలల వేతనం తీసుకున్నారు? పెండింగ్ ఎంత ఉంది? అనే వివరాలు ఇంటిలిజెంట్ వర్గాలు సేకరిస్తున్నాయి. కొన్ని శాఖల్లో సరైన సమాచారం దొరకడం లేదని చెబుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి వాటిలో జీతాలు తీసుకోకుండా కొంతమంది పనిచేస్తున్నట్లు కూడా వారి దృష్టికి వచ్చింది.