News & Views

చర్చ, కరీంనగర్: ఆపరేషన్ స్మైల్ విజయవంతం చెయాలి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే..

  • బాల కార్మికుల నిర్మూలనకు
    సమిష్టిగా పరిచేయాలి..
  • బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠినంగా వ్యవహరించండి..
  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
    అశ్విని తానాజీ వాకడే..
  • సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష..

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించాలని కరీంనగర్ ఆడిషినల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని తెలిపారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం జనవరి 1 నుండి జనవరి 31 వరకు వివిధ శాఖల సమన్వయంతో పక్కగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుకబట్టీలు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు లేదా సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 కు సమాచారం ఇవ్వాలన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠినంగా వ్యవహరించాలని, బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని పనిలో పెట్టుకుంటే యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలన్నారు. జిల్లాలో బాల కార్మికుల నిర్మూలన ప్రత్యేకంగా కృషి చేసి బాల కార్మికులు లేని జిల్లాగా కరీంనగర్ జిల్లాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ ధనలక్ష్మి, ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి సుగుణ, టాస్క్ పోర్స్ ఏసీపీ సతీష్, డీసీపీవో పర్వీన్, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్, లేబర్ కమిషనర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, సీడీపీవోలు, పోలీస్, లేబర్, బాలల రక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.