News & Views

చర్చ,పెద్దపల్లి: అంతర్గాం సర్పంచ్ రవికుమార్ ,వారి అనుచులపై ప్రత్యర్థుల దాడి..

  • దాడికి నిరసనగా గ్రామంలో దర్నా..

అంతర్గాం మండల కేంద్రంలోని టీటిఎస్ అంతర్గాం సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ వారి అనుచరులపై ప్రత్యర్ధులు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు .రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామం జనరల్ స్థానాన్ని కేటాయించగా ఎస్టి సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ విజయం సాధించారు.గెలిచిన సందర్భంగా నిన్న సాయంత్రం గ్రామస్తులను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు వెళుతున్న క్రమంలో ప్రత్యర్థులు సర్పంచి రవికుమార్ మరియు వారి అనుచరుల పై దాడికి దిగారు. ఓటమి జీర్ణించుకోలేక అగ్ర వర్ణాలు చెందిన ప్రత్యర్తి తమపై అకారణంగా దాడి చేశారంటూ సర్పంచ్ రవికుమార్ తో పాటు గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు గ్రామంలో నిరసనకు దిగారు‌.దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు .
ఈ సందర్భంగా సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ జనరల్ స్థానంలో పోటీ చేసి విజయం సాదించిన నాపై ఓటమిని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు అకారణంగా దాడి చేశారంటూ ఆరోపించారు.దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.