చర్చ : ప్రజావాణి లొ ఫిర్యాదు పనికిరాద?, ఫిర్యాదు పై పనిచేయని అధికారులు…
అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమి కబ్జా
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని వైనం
అధికారులే కబ్జాదారులకు సహకరిస్తున్న దుస్థితి
పనికిరాని ప్రజావాణి, పనిచేయని అధికారులు…
చుంచుపల్లి మండలం నంద తండా గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె దవాఖాన వెనుక వీధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, ఆక్రమించి గోడ కడుతున్నారని పంచాయతీ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన, ఫీల్డ్ విజిట్ చేస్తాము అని మాటలతో సరిపెడుతున్నారు. ఫిర్యాదు చేసి నెలలు నడుస్తున్న, అధికారులు మారుతున్నారు తప్ప పంచాయతీ భూమిని కాపాడలేకపోతున్నారు. పంచాయతీ సెక్రటరీ పలుమార్లు పనులు నిలిపివేయాలని చెప్పిన, సెక్రెటరీ మాట ఖాథర్ చేయని గ్రామస్తుడు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన, ఎంపీడీవో కి, ఎంపీఓకి ఫిర్యాదు చేసిన కనీసం ఫీల్డ్ విజిట్ చేయని దుస్థితి. అధికారులు భయపడుతున్నారా లేక వారికి సహకరిస్తున్నారా అని గ్రామంలో మాట్లాడుకుంటున్నారు. సెక్రటరీ అనారోగ్య రీత్యా సెలవు తీసుకున్న కారణంగా బిల్ కలెక్టర్ ఫీల్డ్ విసిట్ చేసి పనులు నిలిపివేయండి, సెక్రెటరీ వచ్చాక మీతో మాట్లాడిన తర్వాత మీ పనులు మొదలు పెట్టుకోమని చెప్పిన, కనీస మర్యాద లేకుండా మీ పని మీరు చేసుకోండి, పని ఆపొద్దు అని పని వాళ్లకు చెప్తున్నా కబ్జాదారుడు. ఎంపీఓ ని వివరణ కోరగా, రేపు వచ్చి ఫీల్డ్ విజిట్ చేస్తాము. పరిధి దాటి ఆక్రమించి గోడల నిర్మాణం చేస్తే కూల్చివేస్తాము అని తెలిపారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఆపమని చెప్పాలి, నోటీసులు జారీ చేయాలి. అయినా కూడా వినని పక్షంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా రేపు వస్తామని ఎంపిఓ సమాధానం చెప్పడం కబ్జాదారులకు సహకరిస్తున్నట్లుగా ఉందని గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు.