చర్చ, సత్తుపల్లి: పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం..
పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సత్తుపల్లిలో వారి అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.తదుపరి బైక్ ర్యాలీ చేస్తూ జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం , మంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు కాళ్లతో తొక్కుతూ ఈడ్చుకుంటూ వెళ్తూ అనుచితంగా ప్రవర్తించారు. ఇట్టి విషయామై అడిషనల్ ఎస్ పి కి వ్రాత పూర్వక పిర్యాదు ఇవ్వడం జరిగింది అనంతరం పవన్ కల్యాణ్ ఫోటో కి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చెయ్యటం జరిగింది త్వరలోనే దోషులను పట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆళ్ళ నరేష్, శెట్టి సాయి కుమార్, కొమ్మగిరి శరత్, గుప్తా,దిలీప్, నాగబాబు, సైఫ్, దినేష్, రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు.ప్రశాంతం గా ఉన్న సత్తుపల్లి లో గొడవలు సృష్టించాలనీ చూస్తే చూస్తూ ఊరుకోం ఖబడ్దార్ అని హెచ్చరించారు.