News & Views

చర్చ,రామగుండం : సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్..

 

చర్చ,రామగుండం

కష్టపడి చదవి..
ఉన్నత స్థాయికి ఎదగాలి…
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి:
మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్..

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిసి భాస్కర్ పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా షి టీమ్ ఇన్చార్జి యస్.ఐ.లు ఉషారాణి మరియు హైమ, మంచిర్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌,మంచిర్యాల లో విద్యార్థులకు ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, T-Safe యాప్ మరియు షీ టీమ్ లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎసిపి ప్రకాష్ ముఖ్య అతిథి గా హాజరై విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులు, ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ ఆప్ లలో గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేయడం, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవడం పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్ వేధింపులకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థినులు ఆకతాయిల వేధింపులకు గురైనప్పుడు, ఈవ్ టీజింగ్ లకు భయపడకుండా వెంటనే డయల్ 100కు, లేదా షీ టీమ్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. వేధింపులను నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. చిన్నపిల్లలు శరీర భాగాలపై ఎవరైనా అపరిచితులు అనుచితంగా తాకినప్పుడు లేదా ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినప్పుడు అది బ్యాడ్ టచ్ అని గ్రహించి, వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని వివరించారు.విద్యార్థినులు, మహిళల భద్రత కోసం T-Safe యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, అత్యవసర పరిస్థితుల్లో దానిని ఉపయోగించే విధానం గురించి వివరించారు. షీ టీమ్ సేవలు, వాటి ఉద్దేశాన్ని గురించి వివరిస్తూ, ఎప్పుడూ అందుబాటులో ఉండే రామగుండం షీ టీమ్ నంబర్ వాట్సప్ 6303923700, మంచిర్యాల షి టీమ్ నంబర్ 8712659385 నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. మహిళా విద్యార్థుల రక్షణకు పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మీ రక్షణ మా బాధ్యత అని గుర్తు చేశారు. విద్యార్థి పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను ఎదగాలని అన్నారు. శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ఏసీపీ ప్రకాష్ కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎసిపి ప్రకాష్ గారు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, మంచిర్యాల జిల్లా షి టీమ్ ఇన్చార్జి ఎస్.ఐ లు ఉషారాణి ,హైమ ,స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య ,వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ సీమ ,మహిళా కానిస్టేబుళ్లు జ్యోతి , శ్రీలత కానిస్టేబుల్ సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు