చర్చ, సత్తుపల్లి: నక్క బ్లెస్సీ కి నివాళులు అర్పించి నిరుపేద కుటుంబ సభ్యులకు నగదు సహాయం అందచేత…
నక్క బ్లెస్సీ కి నివాళులు అర్పించి నిరుపేద కుటుంబ సభ్యులకు నగదు సహాయం అందచేత…
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన నక్క మోష, సుజాత ల కుమార్తె నక్క బ్లెస్సి ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.శనివారం రోజు దశదిన కర్మకు హాజరై నక్క బ్లెస్సీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబానికి కిష్టారం ఓపెన్ కాస్ట్ సింగరేణి కార్మికులు, డి ఎల్ ఆర్ కార్మికులు,సింగరేణి అధికారులు మానవతా దృక్పథంతో వారికి 39,300 రూపాయలు వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో
కిష్టారం ఓసి ఉద్యోగులు,ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీ గాజెబాలాజీ,రాజేశ్వరరావు,అల్లి శీను, శ్రీనాథ్ కేడియం ,రంగినేని శ్రీనాథ్, కే కోటేశ్వర్, షేక్ అజ్మత్ , షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.