News & Views

చర్చ, ములుగు: అందరి చూపు కాకులమర్రి వైపే

చర్చ ములుగు : అందరి చూపు కాకులమర్రి వైపే

  • ఏటూరునాగారం బిఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతకు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబుకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, టౌన్ అధ్యక్షుడు కాజా పాషా ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

3వ వార్డు సభ్యుడు బట్టు మానస, 9వ వార్డు సభ్యుడు గోపి పర్వతాలు ఎల్లయ్యతో కలిసి శ్రీలత ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికెళ్లినా, గడపదాటినా, కాకులమర్రి కుటుంబం గతంలో అందించిన సేవలను ప్రజలు కృతజ్ఞతగా స్మరించారు.

మా బాబుకు చికిత్స చేయించారు… మా ఇళ్ల సమస్య తీర్చారు మాకు స్థలాలు ఇచ్చారు ఎల్లప్పుడూ అండగా నిలిచారు అని ప్రజలు స్వయంగా చెబుతూ, శ్రీలతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గ్రామపంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శ్రీలతకు అవకాశం ఇవ్వాలని ప్రజల ఆకాంక్ష.
గెలుపు సునాయాసమేనని బిఆర్ఎస్ కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో:
తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్ రావు, కూనూర్ అశోక్, ఎండి వలీ బాబా, కోనేరు నాగేష్, తాడూరి రఘు, తూరం పద్మ, ప్రమీల, లలిత, సఫియా, సర్దార్ పాషా, వెంకట్రావు, నరసయ్య, కుమ్మరి చంద్రబాబు, గండేపల్లి నరసయ్య, బాస పుల్లయ్య, బాలకృష్ణ, బాసాని శేఖర్, బట్టు గోపి, పర్వతాలు ఎల్లయ్య, జాడి భోజరాజు, యలవర్తి శ్రీనివాసరావు, గుండారపు శీను, గుండారపు రాజు, తాండ్ర విజయ్ తదితరులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.