News & Views

చర్చ, సత్తుపల్లి : గుడిపాడు లో పందులు స్వైర విహారం….

 


సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఒకటో వార్డు గుడిపాడు శివారులో ఒకపక్క మిషన్ భగీరథ పైపులు లీకై ఇళ్ల మధ్యలో నీళ్లు చెరువును తలపిస్తూ ఉంటే మరోపక్క చెత్త చదారంతో పందులు స్వైర విహారం చేస్తుండడంతో కాలనీవాసులు అనారోగ్యం పాలు అవుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపు లీకేజీని, మరియు పందులు కట్టడిని చేయాలని ప్రజల కోరుకుంటున్నారు.