చర్చ: జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు
నవంబర్ 1వ తేది నుండి 30 వరకు పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలు

జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ *
చర్చ, జగిత్యాల
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (నవంబర్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు .శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. తెలిపారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎస్పీ కోరారు.