News & Views

చర్చ,రామగుండం: నస్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్….

నస్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్…..

చర్చ,రామగుండం కమీషనరేట్:

ప్రజలు అందించే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్ నస్పూర్ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్‌ సిబ్బంది తో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును , సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితిల గురించి, ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్‌, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలి గ్రామాలను, కాలనీ లను సందర్శించి ప్రజలతో మమేకమై నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రోడ్ సేఫ్టీ కమిటీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బ్లాక్ స్పాట్లకు గుర్తింపు ఆ ప్రాంతాల్లో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 15 వ తేదీన జరిగే లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులు రాజి పడేవిధంగా ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీ మార్గం రాజ మార్గం అని సూచించాలని తెలిపారు.

ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ , ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్‌.ఐ ఉపేందర్ పాల్గొన్నారు